గుడి ముందే మహిళ తల, చేతులు నరికేసిన యువకుడు

Crime Published On : Tuesday, May 27, 2025 03:00 PM

తెలంగాణలోని సిరిసిల్లలో దారుణం చోటు చేసుకుంది. చందుర్తి గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ(60)ను అదే గ్రామానికి చెందిన మనోజ్ అనే యువకుడు పెద్దమ్మ గుడి ముందు వేట కొడవలితో నరికి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె తల, చేతులు నరికేసినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ మనోజ్ పై మర్డర్ కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...