గర్భిణీ మృతి: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఖరీదు, మృతురాలి బంధువుల ఆందోళన,.

Crime Published On : Friday, March 13, 2020 11:56 AM

అసలే ప్రభుత్వ ఆస్పత్రి, ఇంకేముంది రోగులను పట్టించుకోరు. రోగులు అయితే కాస్త వెనక ముందో సర్దుకుంటారు, కానీ గర్బిణీ విషయంలో కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. నొప్పులతో వచ్చిన మహిళను సరిగా పట్టించుకోలేదు, దీంతో ఆ గర్బిణీ ఆసువులు బాసింది. వివాహిత మృతికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం మొరంగపల్లికి చెందిన మీనా గర్భవతి. నిండుచులాలు కావడంతో ఆమెకు నొప్పులు వచ్చాయి. వెంటనే మోమిన్ పేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యం చేసిన సిబ్బంది, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. భయపడిపోయిన వారు 108 వాహనంలో సదాశివపేట తరలించారు. కానీ అక్కడ కూడా వైద్యులు తమ చేతిలో ఏమీ లేదని, ఉస్మానియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించేలోపు, గర్బిణి మృతిచెందారు.