భర్తకు తన న్యూడ్ వీడియో పంపబోయి... పొరబాటున లైవ్లో పెట్టేసింది
టెక్నాలజీనని మంచిగా వాడుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అదే తప్పుగా వాడుకోవాలనుకున్నా లేదా ఎలా వాడాలో తెలియకపోయినా దాని వల్ల వచ్చే సమస్యలు అదే రేంజ్లో ఉంటాయి. తాజాగా తెలిసీ తెలియని పరిజ్ఞానంతో ఫేస్బుక్ వాడిన ఓ మహిళ పరువు పోగొట్టుకుంది. భర్తకు న్యూడ్ వీడియో పంపాలనుకుని, ఫేస్బుక్ లైవ్లో మొత్తం విప్పేసింది. సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన... మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ ఏరియాలో ఉంటున్న ఓ మహిళ భర్త బల్గేరియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం కుటుంబాన్ని వదిలి, బల్గేరియాకు వెళ్లిన భర్తతో రోజూ ఫోన్లో మాట్లాడుకోవడం, ఫేస్బుక్ ద్వారా ఛాటింగ్ చేసుకోవడం చేస్తుండేది. ఇద్దరి మధ్య దూరం ఎక్కువ కావడంతో భర్త కోరిక మేరకు అప్పుడప్పుడూ న్యూడ్ వీడియోలు తీసి అతనికి పంపిస్తుండేది భార్య. అయితే వాట్సాప్లో న్యూడ్ వీడియోలు పంపడంపై ఆంక్షలు ఎక్కువకావడంతో ఫేస్బుక్ ద్వారా పంపాల్సిందిగా కోరాడు సదరు భర్త.
అయితే ఫేస్బుక్ మెసేంజర్ ద్వారా న్యూడ్ వీడియో పంపాలనుకున్న ఆమె... పొరపాటున ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసింది. లైవ్లో వీడియో రికార్డు అవుతున్న విషయం తెలియక బట్టలన్నీ విప్పేసింది నగ్నంగా నిలబడింది. భర్త కోసం రెచ్చిపోతూ రకరకాల పోర్న్ వేషాలెన్నో వేషింది. ఆమె ఫేస్బుక్ పేజ్లో ఉన్న దాదాపు 2000 మందికి ఈ న్యూడ్ వీడియో వెళ్లిపోయింది. జరిగిన పొరపాటు గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన స్నేహితులు, కుటుంబసభ్యులు, వారి స్నేహితులతో పాటు ఫేస్బుక్ వాడుతున్న తన 20 ఏళ్ల కొడుకు కూడా తల్లి పోర్న్ వీడియోను చూశాడు. ఫేస్బుక్ లైవ్ వీడియో వైరల్ కావడంతో సదరు మహిళ కుటుంబం పరువుపోయింది. విషయం తెలిసిన భర్త భార్యతో మాట్లాడడం మానేశాడు. చదువుల కోసం విదేశాల్లో ఉంటున్న వారి కొడుకు... ఐదేళ్ల దాకా ఇంటి ముఖం చూసేది లేదంటూ తేల్చేశాడు. ఫేస్బుక్ లైవ్ న్యూడ్ వీడియో చూసిన చాలామంది తమ కోరిక తీర్చాల్సిందిగా కోరుతూ ఫోన్లు, మెసేజ్లు చేస్తూ వేధిస్తున్నారు. పొరపాటున చేసిన ఓ చిన్న తప్పు కారణంగా అనుకోని చిక్కుల్లో ఇరుక్కుంది సదరు మహిళ. సోషల్ మీడియాలోని ఫీచర్లను ఉపయోగించుకునేందుకు వాటి గురించి అవగాహన ఏర్పరచుకోవాలని చెబుతున్నారు టెక్ నిపుణులు.