భార్య, పిల్లలు కనిపించడం లేదని కంప్లైంట్.. అంతలోనే..
ఉత్తర ప్రదేశ్ లోని అలీఘడ్ కు చెందిన షకీర్ (40) అనే వ్యక్తి తన భార్య అంజుమ్, నలుగురు పిల్లలు ఈ నెల 15 నుంచి కనిపించడం లేదంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకూ వారి ఆచూకీ లభించలేదు. తాజాగా షకీర్ బంధువులకు ఆమె తాజ్ మహల్ వద్ద మరో వ్యక్తితో కలిసి కనిపించింది. వారు వీడియో తీసి వాట్సాప్ లో పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి తెలిసినవాడేనని, తన భార్యను తన వద్దకు చేర్చాలని షకీర్ అధికారుల్ని కోరాడు.