అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై దారుణం
అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై హత్యాచారం చేసిన దారుణ ఘటన కడపలో చోటుచేసుకుంది. కడప జిల్లాలోని మైలవరంలో బంధువుల పెళ్లికి మూడేళ్ల పాపతో కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి అరటి పండు ఆశ చూపి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై చంపేశాడు. బాలిక కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.