రెండో పెళ్లికి సిద్ధపడిన తండ్రి.. కొడుకు చేసిన పనికి అందరూ షాక్
రెండో పెళ్లికి సిద్ధపడిన తండ్రిని కన్న కొడుకే గొడ్డలితో చంపిన దారుణ ఘటన కామారెడ్డి లింగంపేట్ మండలం అయ్యపల్లి తండాలో చోటు చేసుకుంది. దేవ సోత్ ఫకీరా అనే వ్యక్తి భార్య ఉండగా రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. దీంతో గ్రామస్తులు పెళ్లీడు వచ్చిన కొడుకు ఉండగా తండ్రి రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో తండ్రికి ఎంత చెప్పినా వినకపోవడంతో విసిగిపోయిన కొడుకు గొడ్డలితో తండ్రిని హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.