లవర్ తో ఆ పని చేస్తూ పట్టుబడ్డ కొడుకు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే.. (Video)

Crime Published On : Saturday, May 3, 2025 12:00 PM

21 ఏళ్ల కొడుకు 19ఏళ్ల యువతిని వెంటేసుకొని తిరుగుతుండగా తల్లిదండ్రులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రోహిత్ అనే యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఉండగా అది అతని పేరెంట్స్ చూశారు. కొడుకు అలా చేయడం వారికి నచ్చలేదు. దీంతో ఆగ్రహించిన వారు రోడ్డు మీదే అందరి ముందు రోహిత్‌ను చితకబాదారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.

గుజాయిని పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంగోపాల్ సెంటర్‌లో రోహత్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పాస్ట్‌ఫుడ్ తింటున్నాడు. అమ్మాయితో కలిసి ఉండగా అతని పేరెంట్స్ శివకరణ్, సుశీల అక్కడికి వచ్చి హోటల్ నుంచి అతన్ని బయటకు లాగి ఫుల్లుగా కొట్టారు. రోహిత్‌తోపాటు యువతిని కూడా కొట్టారు. ఆ టైంలో రోహిత్ బైక్‌పై పారిపోడానికి ప్రయత్నించాడు. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి రోహిత్, అతని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కొడుకు లవర్‌ను సుశీల జుట్టు పట్టుకొని కొట్టింది. స్థానికులందరూ చూస్తుండగా కన్న కొడుకుని చెప్పుతో కొట్టింది. ఇదంతా అక్కడున్న కొందరు వీడియో తీశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...