ప్రసవం కోసం వెళ్తే ప్రాణమే పోయింది
ప్రసవం కోసమని వెళ్తే ఓ గర్భిణి ప్రాణమే పోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది. హైదరాబాద్ లో నరేందర్, రేణుక (24) నివాసం ఉంటున్నారు. రేణుక గర్భవతి కావడంతో తొలి కాన్పు కోసం జడ్చర్లలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
రాత్రివేళ రేణుకకు ఫిట్స్ రావడంతో వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని భర్త ఆరోపించాడు. రేణుకకు ఎప్పుడూ ఫిట్స్ రాలేదని చెబుతున్నాడు.