బెడ్రూంలో లవర్ తో దొరికిన భర్త చితక్కొ ట్టిన భార్య

Crime Published On : Wednesday, December 2, 2020 04:30 PM

ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్తను స్థానికులతో కలిసి చితక్కొట్టి పోలీసులకు అప్పగించిందో భార్య. వరంగల్‌లోని శివనగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం, విభేదాల కారణంగా భార్యతో మూడేళ్లుగా దూరంగా ఉంటున్న రవి స్థానికంగా నివసించే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో, తన జీవితాన్ని నాశనం చేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు బుద్ధి చెప్పాలని భావించిన ఆమె సమయం కోసం వేచి చూసింది. ఈ క్రమంలో నిన్న ఉదయం ప్రియురాలితో అతడు సన్నిహితంగా ఉండడం చూసింది. స్థానికుల సహకారంతో వారిద్దరినీ పట్టుకుని చితకబాదింది. అనంతరం వారిద్దరినీ పోలీసులకు అప్పగించారు.