కడుపులో ఉన్న బిడ్డతో సహా గర్భిణీని చంపిన భర్త
సోమవారం విశాఖ నగరం మధురవాడలో దారుణం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన నిండు గర్భిణి భర్త చేతిలో హత్యకు గురైంది. గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష(27) వేర్వేరు కులాలకు చెందిన వీరు 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ అనుకున్నాడు.
అతనికి క్యాన్సర్ ఉన్నట్టు తనను వదిలేయమని నాటకం ఆడాడు. అయితే భార్య మాత్రం తనతోనే జీవితం అని వదిలిపెట్టేందుకు నిరాకరించింది. దీంతో విసిగిపోయిన భర్త అర్థరాత్రి గొంతు నులిమి భార్యను చంపేశాడు.