కార్ డోర్ లాక్.. నలుగురు చిన్నారులు మృతి
విజయనగరం ద్వారపూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కారు డోర్ లాక్ పడటంతో అందులో ఉన్న నలుగురు చిన్నారులు మృతి చెందారు.
ద్వారపూడి గ్రామంలో మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేశారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడకా ఉదయ్ (8), చరిష్మా (6), చారుమతి (8) మనస్విని మృతి చెందారు.