ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బీహార్ కు వెళ్తున్న ట్రావెల్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ ప్రక్కన అదనపు సీటు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే క్రమంలో ఐదుగురు మృత్యువాత పడినట్లు వెల్లడించారు.