ఆత్మీయుల చివరి చూపూ దక్కనివ్వని కరోనా వైరస్: మృతదేహాల అంత్యక్రియల కోసం గైడ్‌లైన్స్..!

Crime Published On : Thursday, March 19, 2020 08:35 AM

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని బలి తీసుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికా సహా చైనా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాల్లో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతోంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందినట్టుగా పేరున్న అమెరికాలోనే కరోనా వైరస్ మృతుల సంఖ్య వందకుపైగా నమోదు కావడం కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ వల్ల 8127 మంది మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య రెండు లక్షలకు దాటిపోవడంతో మరణాల సంఖ్య ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించట్లేదు.

మృతదేహాన్ని నిర్దేశించిన ప్లాస్టిక్ బ్యాగుల్లోనే తరలించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. మతపరమైన ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించింది. మృతదేహంపై దండలు వేయకూడదని, తల నుంచి చిటికెన వేలి వరకు బయటికి కనిపించని విధంగా మృతదేహాన్ని కప్పేయాల్సి ఉంటుందని కేంద్రం తన మార్గదర్శకాల్లో పొందుపరిచింది. చితిపై మృతదేహాన్ని దహించి వేయాల్సిన వారు, దీనికోసం కొన్ని నిబంధనలను ప్రత్యేకంగా పాటించాల్సి ఉంటుందని సూచించింది. డాక్టర్ల సూచనల మేరకే బూడిదను సేకరించాలని స్పష్టం చేసింది.