క్వారంటైన్లలో నర్సులు ముందు ఒంటిపై బట్టలు లేకుండా: బూతు పాటలతో.. !

Crime Published On : Friday, April 3, 2020 09:56 AM

కరోనా అనుమానితుల పేషెంట్లు, బాధితుల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తోన్న డాక్టర్లు, నర్సులు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. క్వారంటైన్లలో ఉంటోన్న కొందరు కరోనా అనుమానిత పేషెంట్లు. వైద్యానికి ఏ మాత్రం సహకరించట్లేదు. నర్సులు, మహిళా డాక్టర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఒంటిపై బట్టలు లేకుండా క్వారంటైన్లలో తిరుగాడుతున్నారు. దీనిపై ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.

వివరాలలోకి వెళితే ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరిని ఘజియాబాద్‌లోని ఎంఎంజీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచారు. తాము వైద్య చికిత్స నిర్వహించడానికి వెళ్లిన సమయంలో క్వారంటైన్లలో ఉన్న కొందరు అనుమానిత పేషెంట్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. బట్టలు లేకుండా తిరుగుతున్నారని, సిగరెట్లను తెచ్చివ్వాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. తమ సమక్షంలో బూతు పాటలు పాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రిని సందర్శించారు. పేషెంట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి అలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.