Breaking: టీడీపీ నేతపై దారుణ హత్య
ఒంగోలుకు చెందిన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్ లోని తన కార్యాలయంలో ఉన్న ఆయనపై ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు దాడి చేశారు. అప్రమత్తమైన స్థానికులు ఆయన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.