హిజ్రాలు వేధిస్తే 100కు డయల్ చేయండి లేదా 94906 17444 వాట్సప్ నంబర్ కు మెసేజ్ ఇవ్వండి

Crime Published On : Saturday, February 20, 2021 12:00 PM

Hyderabad, Dec 27:  తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కొందరు హిజ్రాలు హల్‌చల్‌ చేశారు. నగరంలోని బాచుపల్లి ప్రగతి నగర్‌లో (pragathi nagar) ఓ ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా (Hijras making nuisance) ప్రవర్తించారు. అంతేకాకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేశారు.పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేసిన హిజ్రాలు వారికి సహకరించిన ఆటో డ్రైవర్లను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. 

ఘటన వివరాల్లోకెళితే.. ప్రగతినగర్‌ ఆర్‌.కె.లేఅవుట్‌కు చెందిన ప్రేవేటు ఉద్యోగి ఈనెల 24న తన కుమారుడి వివాహం జరిపించాడు. 25న ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసే క్రమంలో 8 మంది హిజ్రాలు ఆయన ఇంటికి వచ్చి రూ.20 వేలు డబ్బులు డిమాండ్‌ చేశారు.  అందుకు ఆ ఇంటి యజమాని నిరాకరించడంతో  హిజ్రాలు అసభ్యకర రీతిలో అక్కడే అర్ధనగ్న ప్రదర్శన చేశారు. భయపడిన కుటుబ సభ్యులు వారికి రూ.16,500 ఇవ్వడంతో వెళ్లిపోయారు.

ఈ విషయంపై బాధితుడు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు ప్రగతినగర్‌ ఎలీప్‌ చౌరస్తాలో టీఎస్‌15 యూడీ 0298 ఆటోలో వెళ్తున్న 8 మంది హిజ్రాలను, ఆటో డ్రైవర్లు కరణ్‌ గుప్త, మొహమ్మద్‌ మాసీలను అరెస్టు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తం 8 మంది హిజ్రాలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 సెల్‌ఫోన్లు, రూ. 16,500 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయమై మాదాపూర్‌ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు (Madhapur DCP M.Venkateshwarlu) మాట్లాడుతూ.. అమాయకులను వేధించే ట్రాన్స్‌జెండర్లపై (Hijras) కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని, లేదా వాట్సాప్‌ నెంబర్‌ 94906 17444కు సమాచారం ఇవ్వాలని సూచించారు.