శాడిస్ట్ భర్తకు షాక్, పోలీస్ స్టేషన్‌ ముందే భార్య బంధువులు ఇలా,

Crime Published On : Tuesday, March 3, 2020 11:33 AM

అతనో శాడిస్ట్ భర్త. పెళ్లయిన తొలినాళ్ల నుంచే అదనపు కట్నం కోసం వేధించేవాడు. మానసికంగా,శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. పైగా వాటిని వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఇన్నాళ్లు అతని వేధింపులను భరిస్తూ వచ్చిన భార్య ఇక తనవల్ల కాదని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే క్రమంలో విచారణ నిమిత్తం పోలీసులు అతన్ని స్టేషన్‌కు పిలిపించగా, అక్కడే అతన్ని పట్టుకుని ఆమె బంధువులు దేహశుద్ది చేశారు. కర్నూలు జిల్లా డోన్‌లో ఈ ఘటన జరిగింది.