అమెరికాలో తయారుచేసే అన్ని ఫోన్లకూ టారిఫ్
అమెరికాలో తయారుచేసే ఏ కంపెనీ ఫోన్ కైనా టారిఫ్ నిబంధన వర్తిస్తుందని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఐఫోన్ల ఉత్పత్తికి సంబంధించి టెక్ అగ్రగామి అయిన యాపిల్ సంస్థకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టారిఫ్ బాంబును శాంసంగ్ పైనా విసిరారు. శాంసంగ్ సహా అమెరికాలో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్ లకు 25%టాక్స్ నిబంధన వర్తిస్తుందని ట్రంప్ వెల్లడించారు.