నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ట్రేడింగ్ ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నిన్న భారీ లాభాల్లో దూసుకుపోయిన మదుపర్లు నేడు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ మేరకు ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 81,887 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,760 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎయిర్టెల్, TCS, మారుతి సుజుకి, టెక్ మహీంద్రా షేర్లు స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి.