ఎయిర్టెల్ కు భారీ లాభాలు
ఎయిర్టెల్ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.11,022 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రూ.2071.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అప్పటితో పోలిస్తే కంపెనీ నికర లాభం ఐదింతలు పెరగడం గమనార్హం. గతేడాది జులైలో కంపెనీ చేపట్టిన ఛార్జీల పెంపు కారణంగా అనూహ్యంగా లాభాలు పెరిగాయి.