విపణిలోకి బజాజ్ పల్సర్ ఎన్ఎస్125

Automobiles Published On : Saturday, July 6, 2019 01:00 PM

దేశీయ దిగ్గజం బజాజ్ ఆటో త్వరలో సరికొత్త బజాజ్ ఎన్ఎస్ 125 బైకును విపణిలోకి ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ఎన్ఎస్ 125 బైకును దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.125 సీసీ బైకుల సెగ్మెంట్లో అత్యధిక వాటాను సొంతం చేసుకునేందుకు ప్రతి నెలా 2.50 లక్షల 125సీసీ బైకులను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నాము. ఇందులో భాగంగానే వచ్చే ఆగష్టులో ఓ కొత్త 125సీసీ బైకును విపణిలోకి ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు రాజీవ్ బజాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.

బజాజ్ ఎన్ఎస్ 125 బైకులో సాంకేతికంగా 124.45సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 12బిహెచ్‌పి పవర్ మరియు 11ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 125సీసీ మోటార్ సైకిల్ కాబట్టి ఇందులో ఏబీఎస్ అవసరం లేదు. దీంతో విపణిలో విపరీతమైన పోటీ ఉండేలా ఎన్ఎస్ 125 ధరలు నిర్ణయించే అవకాశం ఉంది. ఏబీఎస్ లేకపోయినా.. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్) ఇందులో ఉంది. దీని ధర సుమారుగా రూ. 70,000 ఎక్స్‌-షోరూమ్(ఇండియా)గా ఉండవచ్చు.