వాట్సప్‌లోకి అద్భుతమైన న్యూ ఫీచర్స్ వస్తున్నాయి

Saturday, December 28, 2019 02:00 PM Technology
వాట్సప్‌లోకి అద్భుతమైన న్యూ ఫీచర్స్ వస్తున్నాయి

వాట్సప్‌ త్వరలో తన యూజర్లకు పలు అద్భుతమైన ఫీచర్లను అందివ్వనుంది. వాటిలో డార్క్‌ మోడ్‌, లో డేటా మోడ్‌, మల్టిపుల్‌ డివైస్‌ సపోర్ట్‌ తదితర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికే అనేక సోషల్ యాప్స్‌లో డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ లభిస్తుండగా వాట్సప్‌లో ఆ ఫీచర్‌ ఇంకా రాలేదు. కానీ త్వరలోనే ఈ ఫీచర్‌ను యూజర్లకు అందివ్వనున్నారు. అలాగే లో డేటా మోడ్‌ ఫీచర్‌ను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో మొబైల్‌ డేటా వాడుతున్నప్పుడు డేటా సేవ్‌ అవుతుంది. అలాగే మల్టిపుల్‌ డివైస్‌ సపోర్ట్‌ ఫీచర్‌ ద్వారా ఒక వాట్సాప్‌ అకౌంట్‌ను ఎన్ని డివైస్‌లలో అయినా వాడుకోవచ్చు. ఇక క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా కాంటాక్ట్‌ల షేరింగ్‌, వాట్సాప్‌ స్టేటస్‌ హైడింగ్‌ తదితర ఫీచర్లను కూడా వాట్సాప్‌ త్వరలోనే అందివ్వనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లను వాట్సప్‌ టెస్ట్‌ చేస్తుండగా.. అతి త్వరలోనే కొత్త అప్‌డేట్‌ ద్వారా వాటిని వాట్సప్‌ తన యూజర్లకు అందివ్వనుంది.

డార్క్‌మోడ్‌ ఫీచర్‌
ఫేస్‌బుక్‌ యాజమాన్యంలో నడుస్తున్న వాట్సప్‌ ఎప్పటి నుంచో ఊరిస్తున్న డార్క్‌మోడ్‌ ఫీచర్‌ కొందరు యూజర్లు ఇప్పటికే వాడుతున్నారు. వాట్సప్‌ డార్క్‌మోడ్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ ఇప్పటికే సిద్ధమైందని, ఐఓఎస్‌ వెర్షన్‌ తుదిరూపు దిద్దుకుంటోందని బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. డార్క్‌మోడ్‌ అంటే..సాధారణంగా ఇంటర్నెట్‌ సమాచారమంతా తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌ నల్లని అక్షరాల్లో ఉంటుంది. దీనికి భిన్నంగా నలుపు బ్యాక్‌ గ్రౌండ్‌తో తెలుపు రంగులో అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల కళ్లకు తక్కువ శ్రమ కలుగుతుందని, రాత్రి వేళల్లో  యాప్‌ను ఉపయోగించే వారికి సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

డేటా మోడ్
డార్క్ మోడ్‌తో పాటు 'లో డేటా మోడ్' కూడా రానుంది. గతంలో లో డేటా ఫీచర్ కేవలం వాట్సప్ కాల్స్‌కు మాత్రమే ఉంది. ఇప్పుడు యాప్ మొత్తానికి ఈ ఫీచర్ రానుంది. దీని వల్ల నెట్వర్క్ డేటా యూసేజ్ తగ్గుతుంది. అంటే మీ మొబైల్ డేటా తక్కువగా ఖర్చవుతుంది. 

మల్టిపుల్ డివైజ్ సపోర్ట్
వాట్సప్‌లో మల్టిపుల్ డివైజ్ సపోర్ట్ కూడా రానుంది. మీ వాట్సప్‌ను ఎన్ని డివైజ్‌లల్లో అయినా ఉపయోగించుకోవచ్చు. మీ వాట్సప్‌లో కాంటాక్ట్స్ యాడ్ చేయడానికి క్యూ ఆర్ కోడ్ ఫీచర్ కూడా రానుంది. అంటే మీరు క్యూ ఆర్ కోడ్ ద్వారా కాంటాక్ట్ షేర్ చేయొచ్చు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి కాంటాక్ట్ యాడ్ చేయొచ్చు.

హైడ్ చేసే ఫీచర్ 
వాట్సప్ స్టేటస్‌ను మ్యూట్ చేసిన తర్వాత హైడ్ చేసే ఫీచర్ కూడా రాబోతుంది. ఇన్నాళ్లూ మీరు మ్యూట్ చేసిన స్టేటస్‌లు చివర్లో కనిపించేవి. హైడ్ మ్యూటెడ్ స్టేటస్ ఫీచర్‌తో ఆ స్టేటస్‌ను పూర్తిగా హైడ్ చేయొచ్చు. వాట్సప్‌లో సెల్ఫ్ డిస్‌ట్రక్టింగ్ మెసేజెస్ ఫీచర్ గురించి తెలిసిందే. మీరు పంపిన మెసేజ్ కొంత సమయం తర్వాత డిలిట్ కావడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది.
 

For All Tech Queries Please Click Here..!