ఒప్పో నుంచి సూపర్ కెమెరాలతో ఒప్పో రెనో 2జడ్, ఒప్పో రెనో 2  స్మార్ట్‌ఫోన్లు

Thursday, September 19, 2019 12:44 PM Technology
ఒప్పో నుంచి సూపర్ కెమెరాలతో ఒప్పో రెనో 2జడ్, ఒప్పో రెనో 2  స్మార్ట్‌ఫోన్లు

ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్లు రెనో 2జడ్‌, రెనో 2ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రెనో 2జడ్‌ ల్యూమినస్ బ్లాక్, స్కై వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదల కాగా రూ.29,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని విక్రయాలు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మొదలవుతాయి. అలాగే ఒప్పో రెనో 2 స్మార్ట్‌ఫోన్ ఓషియన్ బ్లూ, ల్యూమినస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర రూ.36,990గా ఉంది. దీన్ని సెప్టెంబర్ 20వ తేదీ నుంచి విక్రయించనున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్‌కు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర సైట్లలో ప్రీ ఆర్డర్లను ప్రారంభించనున్నారు. 

ఒప్పో రెనో 2జడ్ ఫీచర్లు
6.5 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ , ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి90 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డాల్బీ అట్మోస్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

ఒప్పో రెనో 2 ఫీచర్లు
6.55 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ , ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 13, 2 మెగాపిక్సల్ ట్రిపుల్‌బ్యాక్ కెమెరాలు,16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ , డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

ఈ ఫోన్లలో హైలెట్ ఫీచర్ ఏదైనా ఉందంటే అది కెమెరానే చెప్పుకోవచ్చు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను రెండు ఫోన్లలో ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా రెనో 2లో 13 మెగాపిక్సల్ టెలిఫొటో లెన్స్ కెమెరా, ఒప్పో రెనో 2జడ్లో 8 మెగాపిక్సల్ టెలిఫొటో లెన్స్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో 20ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ లభిస్తుంది. పై భాగంలో 16 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. కేవలం 0.8 సెకన్లలో ఈ కెమెరా పైకి వస్తుంది. అలాగే ఈ ఫోన్లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చారు. 

For All Tech Queries Please Click Here..!