కేబుల్ బిల్ రీఛార్జీకి నూతన విధానం: ఇక మీదట డిష్ బిల్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి...?

Thursday, December 27, 2018 10:49 PM Technology
కేబుల్ బిల్ రీఛార్జీకి నూతన విధానం: ఇక మీదట డిష్ బిల్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి...?

ఇంటింటికీ 24 గంటలు వినోదాన్ని పంచే బుల్లితెర ఇప్పుడు మరింత ప్రియం కానుంది. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన నూతన నిబంధనల ప్రకారం డిసెంబర్ 29, 2018 నుండి మరింత భారం కానుంది. ఇది వరకటిలా ప్రాంతీయ ఛానళ్ల ప్యాకేజీ వారీగా కాకుండా ఛానల్ సంస్థల వారీగా నూతన ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పుడు వస్తున్న అన్ని ఛానళ్లను పొందాలంటే ప్రస్తుతం ఉన్న నెలవారీ కేబుల్ రూ. 350 నుండి రూ. 500 పెరిగే అవకాశం ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) సూచనల మేరకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ టెలివిజన్ నెట్‌వర్క్ సంస్థలు తమ ఛానళ్లు మరియు ప్యాకేజీ ధరలను ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించాయి.

ఒక్కో ఛానల్ సంస్థ నిర్ణయించిన ప్యాక్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు స్టార్ మా, స్టార్ మా మూవీస్, మా మ్యూజిక్, మా గోల్డ్ ఛానళ్లతో పాటు మిగతా అన్ని తెలుగు స్టార్ ఛానళ్ల కోసం ఒకే ప్యాక్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా జెమినీ, జీ మరియు ఈటీవీ ఛానళ్ల కోసం ప్రత్యేక ప్యాక్‌లు తప్పనిసరి.

వీటికంటే ముందు రూ. 130 (18% జీఎస్టీ అదనం) విలువ గల ఫ్రీ-టు-ఎయిర్ ఛానల్స్ ప్యాకేజీ తప్పనిసరిగా ఎంచుకోవాలి. దీనితో పాటు వివిధ ఛానల్ సంస్థల ప్రాతీయ ప్యాకేజీలను అదనంగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 29, 2018 కేబుల్ టీవీల బిల్లులను ఇలా రీఛార్జ్ చేసుకోవచ్చు...
ఫ్రీ-టు-ఎయిర్ ఛానల్స్ తప్పనిసరి ప్యాకేజీ రూ. 130 మరియు జీఎస్టీ(18%) రూ. 23.40 కలుపుకొని మొత్తం రూ. 154.40 లు.
ఈటీవీ ఛానళ్ల కోసం రూ. 24 లు
జీ నెట్‌వర్క్ ఛానళ్ల కోసం రూ. 20 లు
స్టార్ మా ఛానళ్ల కోసం రూ. 39 లు
జెమిని ఛానళ్ల కోసం రూ. 30 లు
వీటితో మరిన్ని ఛానళ్ల కోసం ఆయా నెట్‌వర్క్‌ల రేటు ఆధారంగా ఎంచుకోవచ్చు.
గమనిక: ఫ్రీ-టు-ఎయిర్ ఛానల్స్ తప్పనిసరి ప్యాకేజీ, అన్ని ధరలు నెల రోజులకు మాత్రమే వర్తిస్తాయి మరియు నెట్‌వర్క్ కంపెనీలు ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

For All Tech Queries Please Click Here..!