ఆకట్టుకునే ఫీచర్లతో ఇండియాలో విడుదలైన రెడ్‌మి 8,మోటోరోలా వన్ మాక్రో

Thursday, October 24, 2019 04:15 PM Technology
ఆకట్టుకునే ఫీచర్లతో ఇండియాలో విడుదలైన రెడ్‌మి 8,మోటోరోలా వన్ మాక్రో

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమి నుంచి సరికొత్త‌స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెడ్‌మి 7 విజయవంతమైన నేపథ్యంలో దానికి అప్డేట్ వెర్షన్‌గా రెడ్‌మి 8ను తీసుకువచ్చింది. ఏఐ డ్యూయల్‌ కెమెరాలతో 3జీబీ  ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌, 4జీబీ  ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఇది లభించనుంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.7,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,999గా ఉంది. అల్టిమేట్ స్క్రీన్ ప్రొటెక్షన్"తో  రెడ్ , బ్లూ, బ్లాక్‌ కలర్ ఆప్షన్‌లో  "ఆరా మిర్రర్ డిజైన్" తో  దీన్ని ఆవిష్కరించింది.  ఈ ఫోన్‌ను ఈ నెల 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్‌లలో విక్రయించనున్నారు.

రెడ్‌మీ 8 ఫీచర్లు
6.22 ఇంచ్ హెడీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


దీంతో పాటుగా మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటోరోలా వన్ మాక్రోను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.9,999 ఉండగా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి విక్రయించనున్నారు. జియో యూజర్లకు ఈ ఫోన్ కొనుగోలుతో రూ.2200 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్లు, 125 జీబీ అదనపు డేటాను అందివ్వనున్నారు.

మోటోరోలా వన్ మాక్రో ఫీచర్లు 
6.2 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

For All Tech Queries Please Click Here..!