జియోఫైబర్ వాడే ముందు ఈ విషయం తప్పక తెలుసుకోండి

Tuesday, October 8, 2019 03:00 PM Technology
జియోఫైబర్ వాడే ముందు ఈ విషయం తప్పక తెలుసుకోండి

జియో ఫైబర్‌ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే రిజిస్ట్రర్ చేసుకున్న వినియోగదారులు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ హోం సొల్యూషన్ పొందనున్నారు. జియోఫైబర్ నెట్ బేసిక్‌ స్పీడ్‌ 100 ఎంబీపీఎస్‌ కాగా.. గరిష్టంగా 1జీబీపీఎస్ వరకు బ్యాండ్‌ విడ్త్‌ను అందించనున్నట్లు జియో తెలిపింది. జియో ఫైబర్‌ బేసిక్‌ ప్లాన్‌ 699 రూపాయల నుంచి మొదలవతుంది. గరిష్ట ధరను  8,499 రుపాయలుగా నిర్ణయించింది. ఈ ప్లాన్ కైనా వినియోగదారులు రూ. 2500  డిపాజిట్ చెల్లించి కనెక్షన్ పొందాల్సి ఉంటుంది. ఇందులో వెయ్యి రుపాయలు ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు కాగా మిగతా 1500 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే కంపెనీ ప్రవేశపెట్టిన Bronze, Silver, Gold, and Diamond plansకు వచ్చే అదనపు డేటా కేవలం ఆరునెలలకు మాత్రమే పరిమితమని కంపెనీ తెలిపింది. పైబర్ బ్రాండ్ పరిచయంలో భాగంగా ఈ అదనపు డేటాను అందిస్తున్నామని తెలిపింది. ప్లాన్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

Bronze Plan
మొదటి ఆరు నెలలు ఈ ప్లాన్ కింద యూజర్లు 150 జిబి ఇంటర్నెట్ పొందుతారు. ఆ తర్వాత హై స్పీడ్ డేటా వినియోగం 100జిబికి తగ్గిపోతుంది. 

Silver Plan 
మొదటి ఆరు నెలలు ఈ ప్లాన్ కింద యూజర్లు 400 జిబి ఇంటర్నెట్ 100Mbpsతో పొందుతారు. ఆరు నెలల తర్వాత హై స్పీడ్ డేటా వినియోగం 200జిబికి తగ్గిపోతుంది. 

Gold Plan 
మొదటి ఆరు నెలలు ఈ ప్లాన్ కింద యూజర్లు 750 జిబి ఇంటర్నెట్ 250Mbpsతో పొందుతారు. ఆరు నెలల తర్వాత హై స్పీడ్ డేటా వినియోగం 500జిబికి తగ్గిపోతుంది. 

Diamond Plan 
మొదటి ఆరు నెలలు ఈ ప్లాన్ కింద యూజర్లు 1500 జిబి ఇంటర్నెట్ 500Mbpsతో పొందుతారు. ఆరు నెలల తర్వాత హై స్పీడ్ డేటా వినియోగం 1250జిబికి తగ్గిపోతుంది. 

Platinum Plan 
మొదటి ఆరు నెలలు ఈ ప్లాన్ కింద యూజర్లు 2500 జిబి ఇంటర్నెట్ 1Gbpsతో పొందుతారు. ఆరు నెలల తర్వాత కూడా అదూ హై స్పీడ్ తో డేటాను పొందుతారు. 

Platinum Plan 
మొదటి ఆరు నెలలు ఈ ప్లాన్ కింద యూజర్లు 5000 జిబి ఇంటర్నెట్ 1Gbpsతో పొందుతారు. ఆరు నెలల తర్వాత కూడా అదూ హై స్పీడ్ తో డేటాను పొందుతారు. 

అవర్ ఒపినియన్
 ఎప్పటి నుంచో ఊరిస్తూ వచ్చిన జియో ఎట్టకేలకు లాంచ్ అయింది. కంపెనీ అదనంగా కూడా కొన్ని అపరిమిత ప్లాన్లను అందిస్తోంది. జియో ఫైబర్ మాదిరిగానే ఈ ప్లాన్లు ఉన్నాయి. కాగా జియో ప్రకటించిన Rs. 700 for 100GB data అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నదే. Bronze, Silver, or the Gold ప్లాన్లు వాడేవారు ఆరు నెలల తర్వాత కొంచెం నిరాశపడే అవకాశం ఉంది. ఆరు నెలల తర్వాత కంపెనీ కొత్త ప్లాన్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.


 

For All Tech Queries Please Click Here..!