పాత ఫోన్లను మూలన పడేయకుండా హోమ్ సెక్యూరిటీ కెమెరాగా వాడండి

Wednesday, October 9, 2019 12:00 PM Technology
పాత ఫోన్లను మూలన పడేయకుండా హోమ్ సెక్యూరిటీ కెమెరాగా వాడండి

మార్కెట్లోకి రోజు రోజుకి కొత్త కొత్త ఫోన్లు వస్తున్నాయి. వినియోగదారులు కూడా టెక్నాలజీకి అనుగుణంగా మారిపోతున్నారు. వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని మొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్లతో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దీంతో పాత ఫోన్లను మూలన పడేస్తూ కొత్త ఫోన్ల వైపు అందరూ పరిగెడుతున్నారు. అయితే కొత్త ఫోన్లు కొన్నంత మాత్రాన పాత ఫోన్లను మూలన పడేయాల్సిన అవసరం లేదు. మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను హోమ్ సెక్యూరిటీ అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. మీ పాత ఫోన్లను సీసీ కెమెరా సిస్టమ్‌గా వాడటం వల్ల సెక్యూరిటీ కెమెరాల అవసరం ఉండదు. ఈ కింది సూచనల ద్వారా మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను హోమ్ సెక్యూరిటీ కెమెరాలా ఉపయోగించుకోండి.

స్టెప్ 1 : 
ముందుగా మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఓ సెక్యూరిటీ కెమెరా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇటువంటి యాప్స్ ప్లే స్టోర్‌లో ఇబ్బడి మబ్బడిగా లభ్యమవుతున్నాయి. వీటిని ఉచితంగా కూడా పొందే వీలుంటుంది. యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్న తరువాత ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసి మీ పేరుతో అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. అకౌంట్‌ను క్రియేట్ చేసే సమయంలో మీ బేసిక్ సమాచారాన్ని యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది.

స్టెప్ 2 : 
యాప్ ఇన్ స్టాలేషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తయిన తరువాత మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడ ఉంచాలన్నది నిర్థారణ చేసుకోండి. మీరు ఎంపిక చేసుకునే ప్లేస్ మంచి వ్యూవింగ్ యాంగిల్స్ ను కలిగి ఇదే సమయంలో సాధ్యమైన ఎక్కువ స్పేస్ ను కవర్ చేసేదిగా ఉండాలి. అటువంటి ప్రదేశాన్ని సెలక్ట్ చేసుకుని అక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఫిట్ చేయండి.

స్టెప్ 3
కెమెరా ఉంచాల్సిన ప్లేస్‌ను నిర్థారించుకున్న దాన్ని మౌంట్ చేసేందుకు ట్రైపోడ్ స్టాండ్ లేదా సక్షన్ కప్ అవసరమవుతంది. మీ ఫోన్ 24x7 కెమెరాలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి లో బ్యాటరీ సమస్య అనేదే తలెత్తకుండా చూసుకోవాలి. పవర్స్ సోర్సుకు దగ్గరగా ఫోన్ ను ఉంచినట్లయితే ఛార్జింగ్ బెడద అనేదే ఉండదు.

కావాల్సినవి
అయితే మీ ఫోన్ కు తప్పనిసరిగా వైఫై కనెక్షన్ ఉండాలి.  అది లేకుంటే కనీసం 4జీ కనెక్షన్ అయినా ఉండాలి. అలాగే ఛార్జింగ్ అయిపోకుండా ఉండేందుకు దానికి పవర్ బ్యాంకును అటాచ్ చేస్తే ఇంకా మంచింది. ఇవి మాత్రం తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటే మీ సెక్యూరిటీ కెమెరా రెడీ అయినట్లే.
 

For All Tech Queries Please Click Here..!