గూగుల్ పేలోకి కొత్తగా ఎంట్రీ లెవల్ జాబ్స్ ఫీచర్, చెక్ చేసుకోండి

Sunday, October 6, 2019 02:00 PM Technology
గూగుల్ పేలోకి కొత్తగా ఎంట్రీ లెవల్ జాబ్స్ ఫీచర్, చెక్ చేసుకోండి

గూగుల్ పే ఇండియాలో తన వాల్ మీద నిరుద్యోగుల కోసం సరికొత్త ఫ్లాట్ ఫాంను రూపొందించింది. ఈ ఫీచర్ ద్వారా నిరుద్యోగులు ఎంట్రీ లెవల్ ఉద్యోగ సమాచారాన్ని ఇకపై గూగుల్ పే ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ సెర్చ్ లో మీకు కనిపించే ఉద్యోగాలకు అలాగే గూగుల్ పేలో కనిపించే ఉద్యోగ సమాచారానికి అసలు సంబంధమే ఉండదు. గూగుల్ లో ఈ ఉద్యోగ సమాచారం సపరేట్ గా కనిపిస్తుంది.గూగుల్ ఈ ఫీచర్ ను యాడ్ చేయడం ద్వారా కొన్ని ఫ్లాట్ ఫాంలను టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో ప్రధానంగా retail, hospitality, and on-demand businesses వంటి రంగాలు ఉన్నాయి. 


గూగుల్ పే ద్వారా ఆర్టిపిషియల్, మిషిన్ లెర్నింగ్ వాటిలో ఎక్కువగా ఉద్యోగ సమాచారం తెలుసుకోవచ్చు. గూగుల్ పే కూడా ఉద్యోగ సమాచారంలో వీటికి ఎక్కవ ప్రాధాన్యాతను ఇస్తోంది. ఎవరైనా మిషిన్ లెర్నింగ్ మీద ఉద్యోగ సమాచారాన్ని అందిస్తే దాన్ని మొత్తం నిరుద్యోగులకు విపులంగా అందిచనుంది. ఇందులో భాగంగా గూగుల్ పే ధర్డ్ పార్టీ బ్రాండ్స్ తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. కాగా గూగుల్ పే పుడ్ డెలివరీ సంస్థలతో ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 
ఇండియా గూగుల్ పేవచ్చే కొన్ని వారాల్లో గూగుల్ ప్లే ప్లాట్ ఫాంపై కొత్త పేమెంట్ ఆప్షన్ రాబోతోంది. టోకెనైజ్ డ్ కార్డుల ఆప్లికేషన్ త్వరలో గూగుల్ ప్రవేశపెట్టనుంది. న్యూఢిల్లీలో జరిగిన ఈవెంట్‌లో కంపెనీ ఈ విషయాలను వెల్లడించింది. ఇప్పటివరకూ గూగుల్ పే ద్వారా యూజర్ బ్యాంకు అకౌంట్ల నుంచి UPI బేసిడ్ పేమెంట్స్ మాత్రమే చేసుకునేందుకు వీలుంది. ఇక నుంచి గూగుల్ పే ద్వారా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను కూడా పేమెంట్ ఆప్లికేషన్ పై యాడ్ చేసుకోవచ్చు. టోకెన్ కార్డులతో పాటు కొత్త స్పాట్స్ ప్లాట్ ఫాం, బిజినెస్ యాప్ సర్వీసులను కూడా గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం గూటుల్ పే అకౌంట్ లో టోకెనైజేషన్ టెక్నాలజీని వినియోగించనుంది. ఈ అప్లికేషన్ ద్వారా మీ కార్డు అసలైన (క్రెడిట్, డెబిట్) కార్డు నెంబర్‌ను వెండర్ లేదా మర్చంట్ కు ఇవ్వడానికి బదులుగా డిజిటల్ టోకెన్ వినియోగించవచ్చు. వచ్చే కొన్ని వారాల్లో గూగుల్ పే టోకెనైజ్ డ్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్టు కంపెనీ ఒక కీలక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతానికి Axis Bank, HDFC, స్టాండర్డ్ ఛార్టెర్డ్ బ్యాంకు, SBI నుంచి Visa కార్డులును మాత్రమే గూగుల్ పే సపోర్ట్ చేయనుంది. కానీ, Mastercard, RuPay కార్డుల యాడింగ్ తో అన్ని బ్యాంకులకు త్వరలో సపోర్ట్ ఇవ్వనుంది. 
గూగుల్ పే ప్లాట్ ఫాం నుంచి మరో కొత్త ప్లాట్ ఫాంను కూడా గూగుల్ ప్రకటించింది. కొత్త స్పాట్స్ ప్లాట్ ఫాం ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు ద్వారా మర్చంట్లు, కంపెనీలు తమ ఫిజికల్ QR-Code, NFC బేసిడ్ పేమెంట్స్ కార్డులతో ఆఫ్ లైన్ లో కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. గూగుల్ పే సర్వీసు ద్వారా మర్చంట్లు తమకు నచ్చిన విధంగా సర్వీసులను కస్టమైజ్ చేసుకోవచ్చు. రిటైల్ స్టోర్లు కూడా తమ మొత్తం క్యాట్ లాగ్ లను యాడ్ చేసుకోవచ్చు. Makemy Trip ప్లాట్ ఫాం ద్వారా నేరుగా గూగుల్ పే నుంచి టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. మర్చంట్లు, వ్యాపారుల కోసం గూగుల్ పే ఫర్ బిజినెస్ అనే సర్వీసును కూడా గూగుల్ ప్రకటించింది. ఈ సర్వీసు కోసం వేరొక యాప్ డెవలప్ చేసింది. దీంతో మర్చంట్లు, వ్యాపారులు ఫోన్ కాల్, ఆన్ లైన్ లో డాక్యుమెంట్లను సబ్మిట్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత గూగుల్ పే ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు.

For All Tech Queries Please Click Here..!