ఇకపై డయల్ చేయడం ద్వారా గూగుల్ అసిస్టెంట్ ఉపయోగించుకోవచ్చు

Sunday, October 6, 2019 03:00 PM Technology
ఇకపై డయల్ చేయడం ద్వారా గూగుల్ అసిస్టెంట్ ఉపయోగించుకోవచ్చు

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వోడాఫోన్ ఐడియాతో ఇండియాలో జట్టుకట్టింది. ఫోన్ నంబర్ డయల్ చేయడం ద్వారా వాయిస్ సెర్చ్ ఉపయోగించుకునేలా కొత్త ఫీచర్ ను గూగుల్ అసిస్టెంట్ లోకి తీసుకువచ్చింది. వొడాఫోన్ ఐడియా యూజర్లు తమ ఫోన్ నుండి 000 800 9191 000 నంబరుకు డయల్ చేయడం ద్వారా గూగుల్ అసిస్టెంట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం హిందీ వర్సన్ ో మాత్రమే అందుబాటులో ఉంది. కొన్ని సూచనలు ఫాలో కావడం ద్వారా యూజర్లు ఇంగ్లీష్ లోకి కూడా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ లోకేషన్ ఛేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఉన్న కరెంట్ లోకేషన్ ఏదైనా వివరాలు అడగవచ్చు. 


ఈ ఫీచర్ వాడుకోవాలంటే మీ మొబైల్ కి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.  మీరు మీ ఫోన్ నుండి నంబరును డయల్ చేసి గూగుల్ అసిస్టెంట్ ను అన్ని రకాల వివరాలను అడిగి తెలుసుకోవచ్చ. దీనికి ఎటువంటి డేటా అవసరం లేదు. ఫోన్ ఆపరేటర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యం 24 గంటల అందుబాటులో ఉంటుంది.ఈ ఫీచర్ ను అన్ని రకాల ఫ్లాట్ ఫాంల మీదకు తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్లోంది. ల్యాండ్ లైన్ నంబరుకు కూడా ఈ సౌకర్యాన్ని అందించేందుకు ఈ రెండు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం ఐడియా, వొడాఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర నెట్ వర్క్ లకు అందుబాటులో లేదు. త్వరలో కంపెనీ ఈ నెట్ వర్క్ లకు కూడా దీన్ని తీసుకురానుందని టెలికం వర్గాలు అంటున్నాయి. 

దీంతో పాటుగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ ఇకపై తెలుగులోనూ సమాధానమివ్వనుంది. ‘‘ఓకే గూగుల్‌’’ అన్న ఇంగ్లిషు పదాలకు మాత్రమే స్పందించే వాయిస్‌ అసిస్టెంట్‌ను తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ పనిచేసేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే ఇప్పుడున్న గూగుల్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.ఓఎస్ లాంగ్వేజ్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రాంతీయ భాషల్లో గూగుల్ అసిస్టెంట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.హిందీలో మాట్లాడాలనుకుంటే ‘‘ఓకే గూగుల్‌ హిందీ బోలో’అని కానీ.. ‘‘టాక్‌ టు మీ ఇన్‌ హిందీ’’ అనిగానీ పలకాల్సి ఉంటుందని,  తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ స్పందించేలా గూగుల్‌ అసిస్టెంట్‌ను ఆధునికీకరించినట్లు గూగుల్‌ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మాన్యుల్‌ బ్రాన్‌స్టీన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త భాషలు అన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లతోపాటు ఆండ్రాయిడ్‌ గో, కియో పరికరాల్లో అందుబాటులోకి రానున్నాయని బ్రాన్‌స్టీన్‌ చెప్పారు. ఒక భాషలోంచి ఇంకో భాషకు తర్జుమా చేయగల గూగుల్‌ ఇంటర్‌ప్రెటర్‌ సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు.

For All Tech Queries Please Click Here..!