శాంసంగ్ గెలాక్సీ A50sలో హైలెట్ ఫీచర్ ఏంటో తెలుసా ?

Wednesday, October 16, 2019 03:00 PM Technology
శాంసంగ్ గెలాక్సీ A50sలో హైలెట్ ఫీచర్ ఏంటో తెలుసా ?

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఈ మధ్య తన లేటెస్ట్ సీరిస్ ఫోన్లు గెలాక్సీ ఎ సీరిస్ లో లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీరిస్ లో Galaxy A50s, Galaxy A30s, బడ్జెట్ ధరలో Galaxy A10sను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ A50s మోడల్ ధరను రూ. 22,999గా నిర్ణయించింది. ఇది ఎంట్రీ లెవల్ ఫోన్ ధర మాత్రమే. కొత్త డిజైన్ తో పాటుగ అధునాతన కెమెరా ఫీచర్లతో దీనిని యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజైన్ పరంగా సాప్ట్ వేర్ పరంగా కెమెరా పరంగా ఈ ఫోన్ అన్ని విధాల అధ్భతుతమైన పనితీరును కనపరుస్తోంది.లాక్ స్క్రీన్ విషయంలో ఈ ఫోన్ సరికొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పవచ్చు. మీరు ఫోన్ అన్ లాక్ చేయకుండా యాప్స్ లోకి వెళ్లకుండా వచ్చిన కంటెంట్ ని చూడవచ్చు. అందుకోసం శాంసంగ్ ఇందులో Glance ఫీచర్ ని యాడ్ చేసింది.ఈ ఫీచర్ ద్వారా మీరు అదిరిపోయే కొటేష్లను మీ స్క్రీన్ మీద ఎప్పటికప్పుడు చూడవచ్చు. దానిని స్వైప్ చేస్తే దానికి సంబంధించిన మరిన్ని వివరాలను చూడవచ్చు. చాలాసార్లు ఇది వీడియోగా కనిపిస్తూ ఉంటుంది.

మీరు మీ లాక్ స్క్రీన్ ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో కెళ్లి మీకు నచ్చిన వాటిని ఆర్డర్ల వారీగా సెట్ చేసుకోవచ్చు. ఇందులో travel, food, fashion, sports and news వంటి వాటిని కేటగిరీల వైడ్ గా మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే గేమ్స్ , పోల్స్ వంటి వాటిని కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. గ్లాంస్ టీవీని కూడా మీరు ఈ ఫీచర్లో పొందవచ్చు. దీంతో పాటుగా మీరు మీ ఇమేజ్ లను, మీ వ్యక్తిగత లాక్ స్క్రీన్ మీద సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు లాక్ స్క్రీన్ మీద హై క్వాలిటీతో లభిస్తాయి. బ్యాటరీకి సంబంధించి కొన్ని ప్రయోజనాలను కూడా ఈ ఫీచర్ మీకు అందిస్తోంది. కాగా ఈ ఫీచర్ శాంసంగ్ ఇతర ఫోన్లు M, J and other A series' modelsలో కూడా లభిస్తోంది. మీరు ఫోన్ ఓపెన్ చేసిన ప్రతీసారి. రీఫ్రెష్ చేసిన ప్రతిసారి మీకు సరికొత్త అనుభూతిని ఈ ఫీచర్ అందిస్తుంది. 

ధర ఫీచర్లు
ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.22,999 ఉండగా, 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.24,999 గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎ50ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.4 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!