ప్లే స్టోర్ లో హానికరమైన యాప్స్..తొలగించుకోవాలని గూగుల్ విన్నపం

Sunday, December 9, 2018 06:15 PM Technology
ప్లే స్టోర్ లో హానికరమైన యాప్స్..తొలగించుకోవాలని గూగుల్ విన్నపం

గూగుల్ కొన్ని యాప్స్ కంపెనీల‌పై కొర‌డా ఝుళిపించింది. దాదాపు 22 యాప్స్‌ను త‌మ ప్లే స్టోర్ నుంచి తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప్లేస్టోర్ లో ఉన్న యాప్స్ ద్వారా హ్యాక‌ర్లు డేటా తస్క‌రించ‌డంతో పాటు వైర‌స్ ను స్మార్ట్ ఫోన్ల‌లోకి పంపే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌ముఖ సైబ‌ర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ సోఫోస్ ఇటీవ‌ల బ‌య‌ట‌పెట్టింది. ఈ నేప‌థ్యంలో తాజాగా స్పార్క‌ల్ ఫ్లాష్ లైట్‌(50 ల‌క్ష‌ల డౌన్ లోడ్లు) స‌హా 22 యాప్స్ ను తొల‌గించింది. యూజ‌ర్లు సైతం వీటిని త‌మ స్మార్ట్స్ ఫోన్స్ నుంచి వెంట‌నే డిలీట్ చేయాల‌నీ, అనంత‌రం స్కాన్ చేసుకోవాల‌ని సూచించింది. ఈ జాబితాలో ఉన్న మిగ‌తా ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్స్ ఏమిటంటే...

 

1. స్పార్క‌ల్ ఫ్లాష్ లైట్‌(50 ల‌క్ష‌ల డౌన్ లోడ్లు)

2. స్నేక్ అటాక్‌(5 ల‌క్ష‌ల డౌన్ లోడ్లు)

3.మాథ్ సాల్వ‌ర్‌(ల‌క్ష డౌన్ లోడ్లు)

4. టేక్ ఏ ట్రిప్‌(ల‌క్ష డౌన్ లోడ్లు)

5. మాగ్నిఫ్ ఐ(ల‌క్ష డౌన్ లోడ్లు)

6. జాయిన్ అప్‌(ల‌క్ష డౌన్ లోడ్లు)

7. జాంబీ కిల్ల‌ర్‌(5 ల‌క్షల‌ డౌన్ లోడ్లు)

8. స్పేస్ రాకెట్(50,000 డౌన్ లోడ్లు)

9. నియోన్ పాంగ్‌(50,000 డౌన్ లోడ్లు)

10. జ‌స్ట్ ఫ్లాష్ లైట్‌(5 ల‌క్ష‌ల డౌన్ లోడ్లు)

11. టేబుల్ స్నూక‌ర్‌(ల‌క్ష డౌన్ లోడ్లు)

12. క్లిఫ్ డైవ‌ర్‌(50,000 డౌన్ లోడ్లు)

13. బాక్స్ స్టేక్‌(50,000 డౌన్‌లోడ్లు)

14. జెల్లీ స్లైస్‌(50,000 డౌన్‌లోడ్లు)

15. బ్లాక్ జాక్‌(50,000 డౌన్‌లోడ్లు)

16. క‌ల‌ర్ టైల్స్‌(50,000 డౌన్‌లోడ్లు)

17. యానిమ‌ల్ మ్యాచ్‌(50,000 డౌన్‌లోడ్లు)

18. రౌలెట్టే మానియా(50,000 డౌన్‌లోడ్లు)

19. హెక్సా ఫాల్‌(50,000 డౌన్‌లోడ్లు)

20. హెక్సా బాక్స్‌(50,000 డౌన్‌లోడ్లు)

21. షేప్ సోర్ట‌ర్‌(5,000 డౌన్‌లోడ్లు)

22. పెయిర్ జాప్‌(5,000 డౌన్ లోడ్లు)

పైన పేర్కొన్న యాప్స్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉంటే వెంట‌నే డిలీట్ చేసి ఫోన్ ను ఓసారి స్కాన్ చేయాల‌ని గూగుల్ సూచించింది.