ప్రపంచంలో టాప్ సెల్లింగ్ ఐఫోన్ మోడల్ ఇదే 

Friday, December 27, 2019 04:00 PM Technology
ప్రపంచంలో టాప్ సెల్లింగ్ ఐఫోన్ మోడల్ ఇదే 

అమెరికాకు చెందిన దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్‌కు చెందిన ఐఫోన్ XR ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న ఐఫోన్ మోడ‌ల్స్‌లో ఒక‌టిగా నిలిచింది. కౌంట‌ర్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. 2018 చివ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలో అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న‌ ఐఫోన్ల‌లో ఐఫోన్ XR మొద‌టి స్థానంలో నిలిచింది. ఐఫోన్ 6 మొద‌లుకొని ఆపిల్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఐఫోన్ 11 సిరీస్ ఫోన్ల‌లో ఎక్కువ‌గా అమ్ముడ‌వుతున్న‌ది ఐఫోన్ XR ఫోన్ అని వెల్ల‌డైంది. కాగా ప్ర‌స్తుతం ఈ ఫోన్ ప్రారంభ ధ‌ర రూ.47,900గా ఉంది. ప‌లు డిస్కౌంట్ల‌తో ఈ ఫోన్‌ను ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో రూ.42,999 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

భార‌త్‌లోనే ఉత్ప‌త్తి
కంపెనీకి చెందిన ఐఫోన్ XR ఫోన్‌ను భార‌త్‌లోనే ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు ఇది వరకే కంపెనీ తెలిపింది. ఇప్ప‌టికే చెన్నై స‌మీపంలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంట్ లో ఐఫోన్ XR ఫోన్ల ఉత్ప‌త్తి ప్రారంభం కాగా ప్ర‌స్తుతం మేడిన్ ఇన్ ఇండియా ఐఫోన్ XR ఫోన్లు మార్కెట్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కాగా ఈ ఫోన్ ఇక భార‌త్‌లోనే ఉత్ప‌త్తి అవుతుండ‌డంతో ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర త‌గ్గింది.

ఐఫోన్ XR ధర 
ఈ క్ర‌మంలో ఈ ఫోన్‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కే వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఐఫోన్ XR ఫోన్‌కు చెందిన 64జీబీ వేరియెంట్ ధ‌ర ప్ర‌స్తుతం రిటెయిల్ మార్కెట్‌లో రూ.49,900 ఉండ‌గా, ఆన్‌లైన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో క్యాష్ బ్యాక్ ఆఫర్ తో  ఈ వేరియెంట్‌ను రూ.44,900 కే విక్ర‌యిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌కు చెందిన మిగిలిన వేరియెంట్ల ధ‌ర‌లు కూడా త‌గ్గాయి.

ఐఫోన్ ఎక్స్ఆర్ తయారీ కోసం 
చెన్నైకి సమీపంలోని సెజ్‌లో మూతపడిన నోకియా ప్లాంట్‌ను ఇప్పుడు ఐఫోన్ ఎక్స్ఆర్ తయారీ కోసం సాల్‌కాంప్ పునరుద్ధరించింది. దీని ద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి కూడా లభించిందనే చెప్పాలి. ఇక్కడ తయారయ్యే యాపిల్ ఎక్స్ఆర్ మోడల్ ఫోన్లు దేశీయంగా అమ్ముడుకావడమేకాక విదేశాలకు సైతం ఎగుమతి అవనున్నాయి.

ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫీచర్లు 
ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫీచర్ల విషయానికి వస్తే..6.1 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, ఏ12 బయోనిక్ ప్రాసెసర్, ఐపి 67 వాటర్ డస్ట్ రెసిస్టెంట్, 12ఎంపీ రియర్‌ కెమెరా, ముందుభాగాన 7ఎంపీ ట్రూడెప్త్ సెన్సార్‌, ఫేస్ ఐడి, లాంటివి ప్రధానంగా ఉన్నాయి. కాగా స్మార్ట్‌ఫోన్లపై దిగుమతుల సుంకాల నేపథ్యంలో ఆపిల్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా కాన్సెప్ట్‌తో తక్కువ ధరలతో ఐఫోన్లను అందుబాటులోకి తేవడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
 

For All Tech Queries Please Click Here..!