వాట్సప్‌లోకి కూడా యాడ్స్ వచ్చేశాయి

Saturday, January 18, 2020 04:15 PM Technology
వాట్సప్‌లోకి కూడా యాడ్స్ వచ్చేశాయి

 వాట్సాప్ 2018లో యూజర్ల కోసం ఎన్నో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది 2020లోనూ మరిన్ని కొత్త ఫీచర్లను రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకూ ఆకర్షణీయమైన ఫీచర్లు, అప్ డేట్స్ తీసుకొచ్చిన వాట్సాప్.. యూజర్ ఎక్స్ పీరియన్స్ మరింత విస్తరించనుంది. ఈ ఏడాదిలో రిలీజ్ చేసే కీలక ఫీచర్లలో ఒకటైన Status Ads ఫీచర్ ప్రేక్షకుల అందబాటులోకి తీసుకురానుంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మాదిరిగానే వాట్సాప్ లో కూడా యూజర్లకు యాడ్స్ కనిపించనున్నాయి. ఇటీవలే నెదార్లాండ్స్ లో జరిగిన ఫేస్ బుక్ మార్కెటింగ్ సమ్మిట్ (FMC) 2019లో కంపెనీ ఈ విషయాన్ని రివీల్ చేసింది.

ఈ సందర్భంగా Ads గురించి ఫేస్ బుక్ మాట్లాడుతూ.. స్టేటస్‌లో యాడ్స్ డిస్‌ప్లే అవుతాయని, అడ్వర్టైజర్ పేరును యూజర్లు చూడొచ్చునని తెలిపింది. అయితే, అడ్వర్టైజర్ కాంటాక్ట్ ప్రొఫైల్ పిక్ ను మాత్రం యూజర్లు చూడలేరని కంపెనీ స్పష్టం చేసింది. కానీ, అడ్వర్టైజ్ మెంట్ పై స్వైపింగ్ చేసి యాడ్ ఏంటో చూడొచ్చు.

ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగానే వాట్సాప్ స్టేటస్ యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి. ఈ స్టేటస్ యాడ్స్ ఫీచర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై కంపెనీ అధికారికంగా రివీల్ చేయలేదు. ప్రస్తుతం యాడ్ ఫీచర్ పై వాట్సాప్ వర్క్ చేస్తుంది.. అతి త్వరలో అధికారిక లాంచింగ్ ఉండే అవకాశం ఉంది. స్టేటస్ యాడ్ ఫీచర్ ఒకసారి అందుబాటులోకి వచ్చాక ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Whatapp Ads ఎలా వర్క్ అవుతాయంటే :
వాట్సాప్ స్టేటస్ లో మాత్రమే ఈ యాడ్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం.. వాట్సాప్ స్టేటస్ లో ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్, ఇతర మల్టీమీడియా ఫైల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదే తరహాలో వాట్సాప్ స్టేటస్ యాడ్స్ కూడా డిస్ ప్లే అవుతాయి. యూజర్ల ఆసక్తి, వారి ప్రవర్తన శైలి ఆధారంగా యాడ్స్ డిస్ ప్లే అవుతాయి.

For All Tech Queries Please Click Here..!