ఫిబ్రవరి 19 న వైయస్‌ఆర్‌ సీపీ బీసీ గర్జన

Tuesday, January 29, 2019 10:30 AM Politics
ఫిబ్రవరి 19 న వైయస్‌ఆర్‌ సీపీ బీసీ గర్జన

బీసీలను అన్ని విధాలుగా కించపరిచిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీలంతా సమైక్యంగా మోసకారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు బీసీ కమిటీని నిర్మించటం జరిగింది. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో పర్యటించి బీసీలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని నివేదిక తయారు చేశామన్నారు.

బీసీల స్థితిగతులపై రూపొందించిన నివేదికను అధ్యక్షులు వైయస్‌ జగన్‌ కి అందజేశామని, అందులోని అంశాలపై వైయస్‌ జగన్‌ క్షుణ్ణంగా కమిటీతో చర్చించారన్నారు. ఫిబ్రవరి 19వ తేదీన వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన జరగనుంది. త్వరలోనే సభా ప్రాంతాన్ని ప్రకటిస్తామన్నారు. వైయస్‌ జగన్‌ గెలుపు అనివార్యమని ప్రతి నోటా వచ్చే మాట ఇది. విజయానికి బీసీలు కూడా భాగస్వామ్యం కావాలి. వంచన చేసిన చంద్రబాబు నైజాన్ని అన్ని చోట్ల ఎండగట్టాలన్నారు. 19వ తేదీన జరగబోయే గర్జనను విజయవంతం చేయాలని కోరారు. వైయస్‌ జగన్‌తో భేటీ అనంతరం పార్టీ కార్యాలయంలో జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు.  

బీసీలను నాశనం చేసిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని జయహో బీసీ సభ పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొన్ని ప్రాంతాల్లో వారికి వాళ్ల కులం కూడా తెలియదని ,మా కులం ఏంటని కమిటీ సభ్యులను అడిగిన పరిస్థితి ఏర్పడిందన్నారు.సంచార జాతులకు కులం పేరు తెలియని పరిస్థితి ఉంది. జయహో బీసీ కార్యక్రమంలో బీసీలంతా మావైపే ఉన్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారని, బీసీలకు ఏం చేసారని బీసీలు మీ వైపు ఉంటారని ప్రశ్నించారు.

For All Tech Queries Please Click Here..!