నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మెడకు డమ్మీ లేఖ: ఎందుకు ఫిర్యాదు చేయలేదంటోన్న వైసీపీ.

Friday, March 20, 2020 09:16 AM Politics
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మెడకు డమ్మీ లేఖ: ఎందుకు ఫిర్యాదు చేయలేదంటోన్న వైసీపీ.

రాష్ట్రంలో కొద్దిరోజులుగా విస్తృతంగా చర్చల్లోకి వస్తోన్న అంశం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాసినట్టుగా చెబుతోన్న ఓ లేఖ. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని, తన ప్రాణాపాయం ఉందని అంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఆయన రాశారని చెబుతోన్న ఓ లేఖ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆ లేఖను తాను రాయలేదని రమేష్‌కుమార్ స్పష్టం చేసినప్పటికీ, ఆ ప్రచారానికి మాత్రం పుల్‌స్టాప్ పడలేదు.

ప్పుడు అదే లేఖ రమేష్‌కుమార్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో పనిచేస్తోన్న ఓ అత్యున్నత స్థాయి అధికారి పేరు మీద నకిలీ లేఖను ఎవరు సృష్టించారు?,దాని వెనుక ఎవరు ఉన్నారు? ఆ స్థాయి అధికారి స్వయంగా ఆ లేఖను తాను రాయలేదని కుండబద్దలు కొట్టినప్పటికీ, దాన్ని విస్తృతంగా ప్రచారంలోకి ఎవరు తీసుకొచ్చారు? అనే ప్రశ్నలను వరుసబెట్టి సంధిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు సైతం ఇదే అనుమానాలను లేవనెత్తారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి తనకు ముప్పు ఉందంటూ ప్రచారంలోకి వచ్చిన ఆ లేఖను తాను రాయలేదని రమేష్‌కుమార్ స్పష్టం చేయడమైతే చేశారు గానీ, దానిపై ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. ఏ పోలీస్ స్టేషన్‌లో కూడా లిఖితపూరకంగా కంప్లయింట్ ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారు.ఈ వ్యవహారం వెనుక గల కారణాలు, వ్యక్తులను వెలుగులోకి తీసుకుని రావాలంటూ వైఎస్ఆర్సీపీ శాసన సభ్యులు స్వయంగా రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేయడం అనుకోని మలుపుగా భావిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!