ఎగ్జిట్ పోల్‌ ఫలితాల్లో తేలిన లెక్కలు: ఏ పార్టీకి ఎన్ని సీట్లు!

Monday, May 20, 2019 07:57 AM Politics
ఎగ్జిట్ పోల్‌ ఫలితాల్లో తేలిన లెక్కలు: ఏ పార్టీకి ఎన్ని సీట్లు!
  • ప్రతిష్టాత్మక నేషనల్ మీడియా ఇండియాటుడే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి 130–135 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 37–40 సీట్లకే పరిమితం కానుందని పేర్కొంది. జనసేనకు ఒక్క సీటు లేదంటే అది కూడా రాకపోవచ్చని విశ్లేషించింది. ఇక ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీకి 18–20, టీడీపీకి 4–6 వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు ఒక స్థానం దక్కే అవకాశం కూడా ఉందని తెలిపింది.
  • టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి 98 అసెంబ్లీ సీట్లు లభించగా టీడీపీకి 65 సీట్లు రావచ్చని తెలిపింది. జనసేనకు 2 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వైఎస్సార్‌ సీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.
  • వీడీపీ అసోసియేట్స్‌ వైఎస్సార్‌సీపీకి 111–121 స్థానాలు, టీడీపీకి 54–60 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో తెలిపింది. ఇతరులు 4 చోట్ల గెలుపొందవచ్చు.
  • వైఎస్సార్‌సీపీ 133 నుంచి 135 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ (సీపీఎస్‌) పేర్కొంది. అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లకే పరిమితమవుతుందని సీపీఎస్‌ సర్వే వెల్లడించింది. జనసేన సున్నా లేదా ఒక్క స్థానంలో గెలుపొందే అవకాశం ఉంది.
  • ‘ఆరా’ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో వైఎస్సార్‌ సీపీ 126 సీట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టీడీపీకి 47 సీట్లు, ఇతరులకు 2 సీట్లు వస్తాయని పేర్కొంది. లోక్‌సభ స్థానాలకు సంబంధించి వైఎస్సార్‌ సీపీ 20–24 చోట్ల, టీడీపీ 1–5 చోట్ల గెలుపొందే అవకాశాలున్నట్లు తెలిపింది.
  • కేకే సర్వేస్‌లో వైఎస్సార్‌ సీపీకి 130–135 సీట్లు లభించాయి. టీడీపీ 30–35 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇతరులు 10–13 చోట్ల గెలుపొందే అవకాశాలున్నట్లు పేర్కొంది. మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌ సీపీకి 98 స్థానాలు దక్కగా, టీడీపీకి 58 సీట్లు వచ్చాయి. ఇతరులు 7 చోట్ల నెగ్గే అవకాశం ఉంది. 

For All Tech Queries Please Click Here..!