అయోమయంలో రాష్ట్రం, అసలేం జరుగుతోంది..!!

Tuesday, June 18, 2019 12:50 PM Politics
అయోమయంలో రాష్ట్రం, అసలేం జరుగుతోంది..!!

ఏపీలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పదేళ్ల క్రితం ప్రారంభించిన పార్టీ, కాంగ్రెస్ మరియు టీడీపీ పార్టీలని భూస్థాపితం చేసి ఆంధ్రపదేశ్ లో అధికారం చేచికించుకుంది. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న బాబు ఎప్పుడు లేని ఓటమిని చవిచూశారు. కేవలం 23 స్థానాల్లో మాత్రమే టీడీపీ పార్టీ గాలిచింది. ఇప్పుడు టీడీపీ పార్టీపై పెద్దగా ఎవరికీ విశ్వాసం లేదు. 23 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది తిరిగి పార్టీ మారాలని అనుకుంటున్నారు అని సమాచారం. ఇప్పటికైతే ఆరుగురు పక్కా పార్టీ మారబోతున్నట్టు స్పష్టమైన సందేశాలు అందుతున్నాయి. అయితే, పార్టీ మారాలని అనుకున్న ఆరుగురు తప్పకుండా పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైకాపాలోకి రావాలి అని జగన్ తేల్చి చెప్పాడట. అంటే వైకాపాలోకి వెళ్లాలని అనుకుంటే తప్పకుండా రాజీనామా చేయాలి.

ఆయా ప్రాంతాల్లో మళ్ళీ ఉపఎన్నిక జరుగుతుంది, ఎన్నికలు జరిగితే తప్పకుండా మూడు పార్టీలు పోటీ చేస్తాయి. ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారు అన్నదే సస్పెన్స్. తెలుగుదేశం పార్టీ గెలిస్తే నాయకులు మారినా, కార్యకర్తలు మారలేదని, వాళ్లకు తెలుగుదేశం పార్టీవైపే ఉన్నారని తెలుస్తుంది. వైకాపా గెలిస్తే ఫ్యాన్ గాలి వీచింది అనుకుంటారు. ఆలా కాకుండా ఉపఎన్నికల్లో జనసేన గెలిస్తే రెండింటికి ప్రజలు కొత్త పార్టీని కోరుకున్నట్లే. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీలు మారే విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కాకుండా ఉన్నది.

For All Tech Queries Please Click Here..!