చుట్టూ కావాల్సినంత నీరు. అయినా చుక్క నీటి కోసం చావు కేక

Friday, August 16, 2019 12:38 PM Politics
చుట్టూ కావాల్సినంత నీరు. అయినా చుక్క నీటి కోసం చావు కేక

చుట్టూ కావాల్సినంత నీరు..అయినా చుక్క నీటి కోసం పాకులాట. వృధాగా సముద్రంలో కలిపే నీటిని మాకు తరలించలేరా రాయలసీమ ఘోష కనిపించడం లేదా..ఇప్పుడు మేలుకోకపోతే రాయలసీమ రైతుకు మిగిలేది కన్నీటి గాధలే. ఒక పక్క కావల్సినంత కరువు ఉంది. మరో పక్క కనుచూపు మేరవరకు వరదలు కనపడుతున్నాయి. అయినా రాయలసీమకు చుక్క నీరు అందడం లేదు. నీరంతా సముద్రంలో కలిపేస్తున్నారు. ఆ నీటిని ఎందుకు ఆ నీటిని వృధాగా సముద్రంలో కలపడం...రాయలసీమకు తరలించండి అంటూ రాయలసీమ వాసులు గళమెత్తుతున్నారు. అందులో భాగంగా ఈ యువకుడు నీటి చుక్క కోసం నిరసించిన బ్రతుకులకు కృష్ట నీరు ఒక వరం కావాలి. రాయలసీమ గొంతును వినిపించండి. అంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతని ఆవేదనను అందరికీ తెలిసేలా చేస్తోంది మనవాయిస్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఈ వీడియోని తప్పకుండా ప్రభుత్వానికి తెలిసేలా షేర్ చేయండి..

For All Tech Queries Please Click Here..!
Topics: