ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?

Wednesday, May 8, 2019 07:55 AM Politics
ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?

కేంద్రంలో నరేంద్ర మోదీ, కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడి ప్రాంతీయ పార్టీలకే ప్రధాని పదవి దక్కే అవకాశం వస్తే ప్రధాని పీఠం టీడీపీ అధినేత చంద్రబాబుకి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మోదీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చెయ్యడంలో మమతా బెనర్జీ, మాయావతి కంటే చంద్రబాబే ముందు ఉన్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి పది కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కితే, చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఐతే ఈ వ్యాఖ్యల వెనక రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడ ఉందనే ప్రచారం సాగుతుంది. ప్రత్యర్థుల్ని తెలివిగా ఇరికించడంలో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న ఉండవల్లి చంద్రబాబును డైవర్ట్ చేసేందుకే ఈ కామెంట్లు చేశారంటున్నారు విశ్లేషకులు.

ఉండవల్లి వ్యూహం ఇదేనా: ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనీ, ఉండవల్లి వైసీపీలో చేరితే జగన్ కేబినెట్‌లో కీలక మంత్రి పదవి దక్కించుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో రాజకీయాలపై చంద్రబాబు పెడుతున్న ఫోకస్‌ను దారి మళ్లించేందుకూ, ఈవీఎంలు, వీవీప్యాట్లపై దృష్టి పెడుతున్న చంద్రబాబును డైవర్ట్ చేసేందుకే ఉండవల్లి ఇలా మాట్లాడారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరిగితే, కౌంటింగ్‌పై టీడీపీ ఎలాంటి అభ్యంతరాలూ లేవనెత్తకుండా ఉంటే, ఫలితం కచ్చితంగా వైసీపీకే అనుకూలంగా ఉంటుందని ఉండవల్లితోపాటూ వైసీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు.

For All Tech Queries Please Click Here..!