బల పరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం

Monday, December 9, 2019 02:00 PM Politics
బల పరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం

 మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే  కీలకమైన బలపరీక్షలో నెగ్గారు.మొత్తం 169 ఓట్లతో మహావికాస్ అఘాడి (Maha Vikas Aghadi) కూటమి విజయం సాధించింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, వికాస్ బహుజన అఘాడీ, 8 మంది స్వతంత్రులు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. కాగా బీజేపీ ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. 

ముందుగా సభలో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ శాసనసభపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ కూటమి ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్‌ కొలంబకర్‌(BJP legislator Kalidas Kolambkar)ను నియమించారని.. ఉద్ధవ్‌ ప్రభుత్వం(Shiv Sena-NCP-Congress alliance) కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆయన స్థానంలో ఎన్సీపీకి చెందిన దిలీప్‌ను నూతన ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా కనీసం వందేమాతరం కూడా ఆలపించలేదని ప్రభుత్వంపై పఢ్నవిస్‌(BJP's Devendra Fadnavis) విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్‌ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఉద్దవ్ నేతృత్వంలోని(Uddhav Thackeray) మహా వికాస్ అఘాడి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సభలో సంబంధం లేని విషయాలను ఫడ్నవీస్ లేవనెత్తుతున్నారని ప్రొటెం స్పీకర్ దిలిప్ పాటిల్(NCP MLA Dilip Walse Patil) అన్నారు. ఈ ప్రత్యేక సెషన్ కి గవర్నర్ అనుమతి ఇచ్చారని,ఈ సెషన్ రూల్స్ ప్రకారం జరుగుతుందన్నారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. అయితే విశ్వాస పరీక్షను ప్రారంభిస్తున్నామని, సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చోవాలని ప్రొటెం స్వీకర్‌ (Maharashtra Assembly Speaker) కోరారు. 

అయితే రాజ్యాంగంపై తాను మాట్లాడేందుకు అనుమతించకపోతే తనకు సభలో కూర్చొనే హక్కు లేదని ఫడ్నవీస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ కూడా స్పీకర్ ను ఎన్నుకోకుండా విశ్వాస పరీక్ష జరగలేదని ఫడ్నవీస్ అన్నారు. ఈ సారి ఉన్న భయం ఏంటి అని పరోక్షంగా సీఎం ఉద్దవ్ ని ఉద్దేశించి విమర్శించారు. 

సభలో హెడ్ కౌంటింగ్ ఓటు సమయంలో అందరు ఎమ్మెల్యేలు సహకరించాలని ప్రొటెం స్పీకర్ కొరినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూనే ఉన్నారు. విశ్వాస పరీక్ష ప్రారంభమైన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

ఈ సెషన్ రాజ్యాంగ విరుద్ధం,అక్రమమని అసెంబ్లీ బయట ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రొటెం స్పీకర్ నియామకం కూడా రాజ్యాంగ విరుద్థమన్నారు. సభ ప్రొసీడింగ్స్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ తాము గవర్నర్ కి లేఖ ఇవ్వనున్నట్లు తెలిపారు.

For All Tech Queries Please Click Here..!