సచివాలయ పరీక్ష ఫలితాలు, అరుహులో అత్యధికులు వాళ్లే...!

Friday, September 20, 2019 11:35 AM Politics
సచివాలయ పరీక్ష ఫలితాలు, అరుహులో అత్యధికులు వాళ్లే...!

గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. పరీక్ష ముగిసిన పది రోజుల్లోనే ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 2(గాంధీ జయంతి) నుంచి 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయబోతోంది.

ఈ క్రమంలో ప్రతి సచివాలయంలోనూ 11 నుంచి 12 మంది శాశ్వత ఉద్యోగులను నియమించి 1,26,728 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 19 రకాల పోస్టులకు 14 రకాల పరీక్షలు నిర్వహించింది. అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ చెప్పారు. అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్లను ఈ నెల 21 నుంచి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. నియామక ఉత్తర్వులు 27న జారీ చేస్తామన్నారు.

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు అర్హత సాధించిన వారిలో అత్యధికంగా బీసీలు 1,00,494 మంది ఉన్నారు. ఎస్సీలు 63,629 మంది ఎస్టీలు 9,458 మంది ఉన్నారు. ఓపెన్‌ కేటగిరీలో 24,583 మంది ఉన్నారు. ఈ పరీక్షల్లో ఓపెన్‌ కేటగిరీకి అర్హత మార్కులు 40 కాగా. బీసీలు 35శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30ు సాధించాలి. ఓపెన్‌ కేటగిరీలో టాప్‌ ర్యాంకర్‌ 122.5 మార్కులు సాధించగా. బీసీ కేటగిరీలోనూ అవే మార్కులొచ్చాయి. ఎస్సీల్లో 114 టాప్‌ మార్కులు కాగా. ఎస్టీల్లో 108 అత్యధిక మార్కులు. జిల్లాలవారీగా రిజర్వేషన్ల ఆధారంగా ఆయా కేటగిరీల అభ్యర్థులకు వచ్చిన మార్కులను బట్టి నియామకం చేపడతారు. ఒకవేళ పోస్టులు ఎక్కువగా ఉండి. తగిన అర్హులు లేకపోతే కటాఫ్‌ మార్కులను తగ్గించి అర్హులను పెంచుతారని తెలిసింది.

For All Tech Queries Please Click Here..!
Topics: