దేశంలోనే తొలిసారిగా కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్ మొదలుపెట్టిన జగన్ సర్కార్..!

Tuesday, March 31, 2020 08:53 AM Politics
దేశంలోనే తొలిసారిగా కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్ మొదలుపెట్టిన జగన్ సర్కార్..!

ప్రాణాంతక కరోనా దేశవ్యాప్తంగా ఆందోళనకరంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో దాని సంఖ్య పరిమితంగానే ఉంది. ఇప్పటిదాకా 23 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ వైరస్ బారిన పడిన తొలి పేషెంట్ కోలుకున్నాడు కూడా. జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో. ఏపీలో ఆ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం చర్చనీయాంశమైంది.

వలంటీర్ల వ్యవస్థ ద్వారా విదేశాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారిని సరైన సమయంలో గుర్తించడం వల్లే ఆది సాధ్యపడిందని జగన్ సర్కార్ చెబుతోంది. కేరళ వంటి ఒకట్రెండు రాష్ట్రాలు ఇలాంటి క్లిష్ట సమయంలో వలంటీర్ల నియామకానికి చర్యలు సైతం చేపట్టాయి. 

తాజాగా మరో వినూత్న ప్రయోగంతో మరోసారి అన్ని రాష్ట్రాల చూపును తన వైపు తిప్పుకొనేలా చేసింది జగన్ ప్రభుత్వం. కొత్తగా కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను తెరమీదికి తీసుకొచ్చింది. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలను గుర్తించడానికి ఉద్దేశించిన సరికొత్త ట్రాకింగ్ సిస్టమ్ ని రూపొందించింది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది జగన్ ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్‌లో ఉండకుండా ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయాన్ని ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా స్పష్టంగా తెలిపేలా దీన్ని రూపొందించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: