టిడిపి అందుకే గెలిచింది : బిజెపి జాతీయ నేత రిపోర్ట్

Saturday, December 15, 2018 11:20 PM Politics
టిడిపి అందుకే గెలిచింది : బిజెపి జాతీయ నేత రిపోర్ట్

2014 లో మోదీ మానియాతోనే టీడీపీ గెలిచిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ ధియోధర్‌ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగు చెందారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరభావం తప్పదని హెచ్చరించారు. ‘ఆంద్రుల ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశాన్ని స్థాపిస్తే.. చంద్రబాబు దానిని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారు. 2014 ఎన్నికల సందర్భంగా రాహుల్ సోనియాలు ఆంద్ర ద్రోహులుగా అభివర్ణించిన బాబు ..నేడు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను మోదీపై వేస్తున్నారు. ఆంద్రుల అసలైన ద్రోహి మోదీ కాదు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మోదీ ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తున్నాం’ అని ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 6న ఏపీలో పర్యటించనున్నారని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీలను చూస్తుంటే చంద్రబాబుకు నిద్రపట్టడంలేదని అన్నారు.