దారుణంగా ఓడిపోయిన సినీ ప్రముఖులు వీరే!

Wednesday, December 12, 2018 11:27 AM Politics
దారుణంగా ఓడిపోయిన సినీ ప్రముఖులు వీరే!

తెలంగాణ ఎన్నికల్లో బాగా ప్రాబల్యం ఉన్న వారికంటే ఏ మాత్రం అంచానాలు లేని అభ్యర్థులు ఎంతో సునాయసంగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ప్రభావం  సీనియర్ నాయకులతో మొదలుకొని సినిమా బ్యాగ్రౌండ్‌తో ప్రజాసేవ చేయాలని ఎన్నికలో బరిలో నిలిచిన సెలబ్రిటీలతో సహా ఎంతో మంది ప్రముఖ దారుణంగా ఓడిపోయారు.
 
తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఘన విజయం సాధించింది. కారు జోరుకు కూటమి సహా ఇతర పార్టీలు అన్నీ కుదేలయ్యాయి . 119 స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ 83 స్థానాలో విజయం సాధించి రెండో సారి అధికారాన్ని కైవసం చేసుకుంది.

అయితే ఈ ఎన్నికల్లో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత, భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ టీడీపీ పార్టీ తరపున శేరిలింగంపల్లి నియోజిక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే బాబు మోహన్ అందోల్ నుండి , నటి రేష్మ రాథోడ్ వైరా నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరితో పాటు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్‌ల సోదరి నందమూరి సుహాసిని కూకట్ పల్లి నుండి పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు.

For All Tech Queries Please Click Here..!