కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను...

Tuesday, December 11, 2018 02:35 PM Politics
కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను...

తెలంగాణ రాష్ట్రానికి రెండో దఫా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఘన విజయాన్ని ఖాయం చేసుకున్న టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణను ప్రారంభించింది. గెలుపొందిన అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలను తీసుకుని హైదరాబాద్ కు రావాలన్న ఆదేశాలు టీఆర్ఎస్ భవన్ నుంచి వెళ్లాయి.    ఎన్నికల తుది ఫలితం వెల్లడై గెజిట్ విడుదల కాగానే, గవర్నర్ నరసింహన్ స్వయంగా ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు. ఆపై రేపు శుభముహూర్తం ఉండటంతో రేపు అట్టహాసంగా కాకుండా, నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయాలన్నది కేసీఆర్ అభిమతంగా తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.