తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Monday, January 21, 2019 10:30 AM Politics
తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల సంగ్రామం మొదలైంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. 3,701 పంచాయతీలకు 12,202 మంది అభ్యర్థులు పోటిపడుతుండగా... వీరి భవితవ్యం నేడే తేలనుంది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. కౌంటింగ్ అనంతరం ఉప సర్పంచ్‌ను కూడా ఇవాళే ఖరారు చేస్తారు. తొలుత ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి అనంతరం చేతులు ఎత్తి ఎన్నుకునే పద్దతి ద్వారా వార్డు మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచుగా ఖరారు చేస్తారు. అయితే తొలుత వార్డులు సభ్యుల అభ్యర్థులకు, తర్వాత సర్పంచ్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించిన తర్వాతే ఉప సర్పంచి ఎన్నిక జరుగుతుంది.

For All Tech Queries Please Click Here..!