తెలంగాణ పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ

Saturday, December 8, 2018 11:15 PM Politics
తెలంగాణ పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ

తెలంగాణలో నమోదైన మొత్తం పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్ నమోదైంది. తెల్లవారుజామున 3.40 గంటలకు జిల్లాల నుంచి అందిన వివరాల ఆధారంగా తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమర్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. 

ఈ సందర్భంగా రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం పెరిగిందని అన్నారు. పురుషుల పోలింగ్ శాతం 72.54 అని, మహిళల పోలింగ్ శాతం 73.88 గా నమోదైనట్టు తెలిపారు. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలను కూడా తెలియజేశారు. ఆసిఫాబాద్‌లో అత్యధికంగా  85.9 శాతం పోలింగ్ నమోదు కాదా హైదరాబాద్‌లో 48.9 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వివరించాడు.