ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌ర్వాత.. వైసీపీని టార్గెట్ చేస్తూ.. టీడీపీ భారీ కుట్ర‌..?

Tuesday, April 23, 2019 02:15 PM Politics
ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌ర్వాత.. వైసీపీని టార్గెట్ చేస్తూ.. టీడీపీ భారీ కుట్ర‌..?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు హోరాహోరీగా జరిగాయి. ఇక అన్ని రాజకీయ పార్టీలు ఫైన‌ల్ రిజ‌ల్ట్ కోసం స‌ర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో అనే విష‌యం పై ఓట‌రు నాడి ఎ పార్టీకి అంతుచిక్క‌డంలేదు. మ‌రోసారి తామే గెలుస్తామ‌ని టీడీపీ అంటుంది. త‌మ‌కు 140 సీట్లు క‌చ్ఛితంగా వ‌స్తాయ‌ని చెప్తున్నారు, కానీ ఈవిఎంల మొరాయింపు పై ప‌దేప‌దే ఆరోప‌లు చేస్తుండ‌డంతో టీడీపీ నేత‌ల‌కు గెలుపు పై ధీమా లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు.

మ‌రోవైపు వైసీపీ కూడా గెలుపు పైన ఎంతో ధీమాగా ఉంది. త‌మ‌కు 120 సీట్లు ప‌క్కా అంటోంది. మెజారిటీ ప్ర‌జ‌లు వైసీపీ గెలిపిస్తారు అన్న ధీమాతో ఉన్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ మ్యాజిక్ ఫిగ‌ర్ కంటే ఎక్కువ సీట్లు సాధించినా టీడీపీ చివర్లో ప‌రిస్థితిని తారుమారు చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఎలా అంటే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి మ్యాజిక్ ఫిగ‌ర్ వ‌చ్చినా వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయ‌డానికి, వైసీపీ నండి 23 మంది ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకుంది.

అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు ఎమ్మెల్యేలను వారివైపు తెచ్చుకునేందుకు టీడీపీ ఎంతటి ప్రయత్నం అయినా చేస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు జగన్ ఎన్నికల ఇంఛార్జిలను నియమించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా గెలిచిన వారు రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి సర్టిఫికేట్ తీసుకోగానే వారిని ఒక్క చోటకు చేర్చి పార్టీ కార్యాలయానికి తీసుకురావాల్సిన బాధ్యతలను పార్లమెంటరీ ఇంఛార్జిలకు అప్పగించారు. దీంతో టీడీపీ వేసే ఎత్తుల‌ను వైసీపీ చిత్తు చేయ‌డానికి వైసీపీ సిద్ధంగా ఉంద‌ని స‌మ‌చారం.

For All Tech Queries Please Click Here..!