ప్రధానికి పవన్ లేఖ

Saturday, December 15, 2018 05:56 PM Politics
ప్రధానికి పవన్ లేఖ

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శ‌నివారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జనసేనాని దృష్టికి హెచ్‌1బీ వీసా కొత్త నిబంధనలను, వాటితో తెలుగువారిపై, వారి భవిష్యత్తుకు ఎదురయ్యే సమస్యలను తీసుకొచ్చారు తెలుగువారు. హెచ్‌1బీ వీసా కొత్త నిబంధనలతో‌ తమ భవిష్యత్తు గందరగోళం అవనుందని పవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జనసేనాని... హెచ్‌1బీ వీసా అమలులో ఏళ్ల తరబడిగా అమెరికాలో ఉంటోన్న భారతీయులకు కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. హెచ్‌1బీ వీసా కొత్త నిబంధనలతో నష్టపోతున్నవారిని ఆదుకునే విధంగా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని లేఖలో ప‌వ‌న్‌ పేర్కొన్నారు.