జగన్ పైన ఆర్గనైజర్ పత్రిక రాసిన విషపు రాతల వెనుక ఉన్న నిజాలు.

Wednesday, February 5, 2020 02:16 PM Politics
 జగన్ పైన ఆర్గనైజర్ పత్రిక రాసిన విషపు రాతల వెనుక ఉన్న నిజాలు.

విష వృక్షం లా ఎదిగి ,దేశం మొత్తం కాదు ,అంతర్జాతీయ మీడియాలో సైతం తన విషపు రాతలు ప్రచారం చేయగల మన పచ్చ మీడియా పట్టుదల ,పోరాట పటిమ చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం ,ముచ్చట కూడా వేస్తుంది. ఆర్గనైజర్ పత్రిక లో జగన్ మూడు రాజధానుల విషయాన్నీ తుగ్లక్ చర్య తో పోల్చి, ముఖ్యమంత్రి జగన్ ని "జుగ్లక్" అంటున్నారని,రచయిత తన కొత్త రాతని ప్రదర్శించాడు. యధావిధిగా చంద్రబాబు కొట్టేసిన 30 వేల ఎకరాలు వ్యవసాయ భూమిని గొప్ప చర్య గా అభివర్ణించి ,అమరావతిని రాజధాని గా ప్రకటించిందే మోడీ అంటూ నిస్సిగ్గుగా తప్పుడు రాతలు రాశారు.

ఇదంతా మన పచ్చ మీడియా పెద్ద అక్షరాలతో అచ్చేసి ఆ పత్రిక RSS వాళ్ళది కాబట్టి ,ఆ రాతలు BJP అభిప్రాయం గా తన సహజ సిద్దమైన మోసపూరిత వేషాలతో ప్రచురించింది. అసలు రాసిన వ్యక్తి ఎవరంటే విజయవాడ వాస్తవ్యులైన " దుగ్గరాజు శ్రీనివాస్ రావు " అనే ఫ్రీలాన్సు జర్నలిస్ట్ . అంటే పలుకుబడి వుంటే ఈ ఫ్రీలాన్సు అవతారం ఎత్తడం పెద్ద కష్టం ఏమీ కాదు. నువ్వూ,నేనూ కూడా రాయచ్చు .ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా. అవును స్వాతి వీక్లీ లో ఎన్నో ఏళ్ళుగా టీడీపీ కి భజన చేస్తూ ,నెహ్రు ని మొదలుకొని సోనియా వరకు అందరినీ తిడుతూ వారం వారం ఒక పచ్చ రాజకీయ విశ్లేషణ రాసే పెద్ద మనిషి.

అసలు తతుగ్లక్ చర్యకు ,జగన్ చర్యకు సంబంధమే లేదని ఈ మేధావి తుగ్లక్ లకు తెలిసినట్టులేదు. కొత్త రాజధాని నిర్మించి ప్రజలని కూడా తరలించాలని చూసిన బాబుదే తుగ్లక్ చర్యకు కరెక్ట్ గా సరిపోతుంది.ఇప్పటికే నగరం గా అభివృద్ధి చెందిన చోటు కు ప్రభుత్వ కార్యాలయాలు మార్చడం ఎలా తుగ్లక్ చర్యనో ఈ తుగ్లక్ లే చెప్పాలి.

For All Tech Queries Please Click Here..!
Topics: